టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించిన శర్వానంద్ అనంతరం హీరోగా వెండితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా హీరోగా తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి విజయం అందుకున్న శర్వానంద్ కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా శర్వానంద్ తన కెరియర్లో ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.పడి పడి లేచే మనసు సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మూడు నెలల పాటు బయటకు రాలేదని తెలిపారు. ఈ సినిమా తర్వాత కో అంటే కోటి సినిమాని తానే నిర్మించాలని ఈ సినిమా చేయటం కోసం తన తల్లి బంగారం మొత్తం అమ్మి సినిమా చేశానని తెలిపారు.
అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా తన ఆశలపై నీళ్లు చల్లిందని డబ్బులు పోయాయి కానీ సినిమా హిట్ కాకపోవడంతో పూర్తిగా అప్పుల్లో చిక్కుకున్నానని శర్వానంద్ వెల్లడించారు. ఇలా ఈ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం సుమారు ఆరు సంవత్సరాల సమయం పట్టిందని ఈ ఆరు సంవత్సరాలలో తాను ఒక షర్టు కూడా కొనలేదని ఈయన తెలిపారు.
ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్,ఎక్స్ ప్రెస్ రాజా హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న పిలిచి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు. అయితే నిజంగానే నా సినిమా హిట్ అయిందా అన్న ఆలోచనలోనే నేనున్నానని సినిమా హిట్ అయిన ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయానని ఈ సందర్భంగా శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.