తాను చేసే ప్రతీ సినిమాలోనూ కొత్తదనం ఉండేలా శర్వానంద్ చూసుకుంటూ ఉంటాడు. తన కెరీర్ ప్రారంభం నుండీ అలాంటి కథల్నే ఎంచుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇతన్ని మంచి టేస్ట్ ఉన్న హీరో అని అందరూ అంటుంటారు. ఇదిలా ఉండగా.. గత రెండున్నరేళ్లుగా శర్వానంద్ కు సరైన సక్సెస్ లేదు. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ క్రమంలో ఓ హిట్ అందుకోవాలని శర్వానంద్ చాలా ట్రై చేస్తున్నాడు.
ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే చిత్రం చేస్తున్నాడు శర్వానంద్. కరోనా ఎఫెక్ట్ లేకపోతే.. ఈ పాటికే ఈ చిత్రం విడుదలయ్యి ఉండేది. ఇది పక్కన పెట్టేస్తే.. శర్వానంద్ తన తరువాతి చిత్రాన్ని ‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్లో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ‘ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నిజానికి ఈ కథను రవితేజ, రామ్, నాగ చైతన్య వంటి హీరోలు రిజెక్ట్ చేశారు.
ఈ కథలో చాలా రిస్క్ ఉందని కూడా ఇన్సైడ్ టాక్. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఓ అమ్మాయి కారణంగా శత్రువులుగా మారతారు. ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. అయినా సరే ఈ ఇద్దరు స్నేహితులు ఒకరి పై ఒకరు పగతీర్చుకోవాలని చూస్తుంటారట. శర్వానంద్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని వినికిడి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న శర్వానంద్ నెగిటివ్ రోల్ చెయ్యడం రిస్క్ అయినప్పటికీ.. ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.