ఇంతవరకు ప్రభాస్ పెళ్లి ఒక టాపిక్ గా మాత్రమే ఉండేది. ఇప్పుడు సాకుగా మారింది. అతని పేరు చెప్పి కొంతమంది పెళ్లి పీఠలు ఎక్కకుండా తప్పించుకుంటున్నారు. యువ హీరో శర్వానంద్ ఈ విషయాన్నీ బయట పెట్టారు. ఎక్స్ ప్రెస్ రాజా, రాజాధి రాజా, శతమానం భవతి వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకు పోతున్న శర్వానంద్ తాజాగా రాధా మూవీతో రాబోతున్నారు. ఈ మూవీ ప్రచారంలో పాల్గొన్న అతన్ని మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు. ” మా ఇంట్లో వాళ్లకి మరో రెండేళ్ల వరకు పెళ్లి మాట ఎత్తొద్దు అని గట్టిగా చెప్పాను. ఎందుకంటే ప్రభాస్ కు కూడా ఇంతవరకు పెళ్లి కాలేదు.
అప్పుడే నా పెళ్ళికి తొందర ఏముందని చెప్పాను” అని వివరించారు. ప్రభాస్ వయసు 37 అయితే శర్వానంద్ వయసు 32. ఐదేళ్లు చిన్నవాడు కాబట్టి ప్రభాస్ ని చూపించి పేరెంట్స్ నోరు మూయించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రభాస్ ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలి. అతనికి పెళ్లి అయితే వరుసగా రానా, శర్వానంద్ పెళ్లి పీఠలు ఎక్కుతారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.