మే నెలని చాలా వరకు లైట్ తీసుకుని సడన్ గా .. మే 31 డేట్ కి తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాయి కొన్ని సినిమా యూనిట్లు. ఇంకా కొన్ని సినిమాలు అయితే జూన్ 7 కి షిఫ్ట్ అయ్యాయి. కాజల్ (Kajal Aggarwal) ‘సత్యభామ’ (Kajal’s Satyabhama) వంటి కొన్ని సినిమాలు జూన్ 7 కి వస్తున్నాయి. ఇప్పుడు శర్వానంద్ (Sharwanand) మనమే కి (Manamey) కూడా అదే డేట్ కి ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకుడు.యంగ్ హీరో శివ కందుకూరి కూడా కీలక పాత్ర పోషించాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) , వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇంత సడన్ గా జూన్ 7 కి రావడం వెనుక కారణం ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వెంటాడుతుంది. జూన్ నెలాఖరుకు ‘కల్కి’ (Kalki 2898 AD) వస్తుంది. ఆ తర్వాత 2 వారాలకు ‘భారతీయుడు 2 ‘ (Indian 2) ఉంది.
ఆ తర్వాత ‘పుష్ప 2 ‘ (Pushpa2) వంటి పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్యలో ‘మనమే’ సినిమా వస్తే.. జనాలు పట్టించుకోరు. పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలకి టికెట్ పెట్టడం ఎందుకు అని లైట్ తీసుకుంటారు. అందుకే జూన్ 7 కి వచ్చేస్తే.. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
మరోపక్క ‘పీపుల్ మీడియా’ సంస్థ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ ..లు వరుస సినిమాలు, పెద్ద సినిమాలు.. చేస్తారన్న మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ.. సోలో నిర్మాతలుగా మాత్రం వీరు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. ‘ధమాకా’ (Dhamaka) ‘కార్తికేయ 2 ‘ (karthikeya 2) వంటి హిట్ సినిమాల్లో వేరే నిర్మాతల హస్తం కూడా ఉందనే సంగతి తెలిసిందే. సోలోగా వీళ్ళు ‘మనమే’ తో ఈసారైనా హిట్ కొడతారేమో చూడాలి..!