Shatrughan Sinha: తన కంటే చిన్నవాడితో సోనాక్షి పెళ్లి.. తండ్రి రియాక్షన్‌ ఏంటంటే?

బాలీవుడ్‌లో కాస్త సీనియారిటీ సంపాదించిన యంగ్‌ హీరోయిన్లలో పెళ్లికి రెడీగా ఉన్న హీరోయిన్‌ సోనాక్షీ సిన్హా. ఆమె పెళ్లి గురించి ఇటీవలే ఆమె జోకులు కూడా వేసుకుంది. అయితే ఇప్పుడు ఆ జోకులు ఇక చాలు అనుకుంది ఏమో.. పెళ్లికి రెడీ అవుతోంది అంటూ నిన్నంతా సోషల్‌ మీడియాలో, బాలీవుడ్‌లో తెగ పుకార్లు షికార్లు చేశాయి. అయితే సాయంత్రానికి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పుకార్లు ఆగడం లేదు.

హిందీ పరిశ్రమకు చెందిన యువ నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది అనేది పుకార్ల సారాంశం. జూన్ 23న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది అని కూడా అంటున్నారు. ముంబయిలో జరిగే ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరవుతారని కూడా అంటున్నారు. సోనాక్షి, జహీర్‌ చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆ వార్త నిజమే, తమ వివాహానికి హాజరయ్యే అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించాలని వివాహ ఆహ్వానపత్రంలో సూచించారు.

మొబైల్ ఫోన్లు ఇక్కడ నిషేధం అని కూడా రాశారు. సల్మాన్ ఖాన్ (Salman Khan) ద్వారా జహీర్‌ను సోనాక్షి కలుసుకుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. సల్మాన్‌, జహీర్‌ మంచి స్నేహితులు అని కూడా అంటారు. అలా స్నేహం మొదలై, ప్రేమగా మారింది అని చెబుతారు. సల్మాన్‌ను సోనాక్షి మెంటార్‌లా భావిస్తుంటుంది. ఇదంతా ఓకే అనుకుంటున్న సమయంలో తన కూతురి వివాహంపై వచ్చిన రూమర్స్‌పై శతృఘ్న సిన్హా స్పందించారు. వారిద్దరి ప్రేమాయణం గురించి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

సోనాక్షి వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. సోనాక్షి ఇప్పటివరకు నాకేమీ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే.. బారాత్‌ ముందు డాన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నా అని అన్నారు. అక్కడితో వదిలేయకుండా ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల అనుమతి కోరడం లేదు. కేవలం సమాచారం ఇస్తున్నారు. ఆమె పెళ్లి వార్త నిజమైతే ఆ జంటను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా అన్నారు. దీంతో పెళ్లి ఉందా? లేదా? అనే క్లారిటీ అయితే లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus