మంచి కాఫీలాంటి సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఫిదా తో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. దీంతో ఉత్సాహంగా ఒకేసారి రెండు మూడు కథలను రెడీ చేస్తున్నారు. ఇందులో ఒకటి పొలిటికల్ స్టోరీ అని తెలిసింది. గతంలో రానాని హీరోగా పరిచయం చేస్తూ లీడర్ వంటి క్లాస్ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనకి కార్య రూపం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పొలిటికల్ ఫీవర్ నడుస్తోంది. తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి హిట్ కావడంతో ఈ రాజకీయ నేపథ్యం ఉన్న కథ పై నమ్మకం పెరిగింది.
అంతేకాదు కొరటాల శివ కూడా నేటి రాజకీయంపై సెటైర్ వేసేలా భరత్ అనే నేను మూవీ తీస్తున్నారు. ఇందులో సీఎం గా మహేష్ బాబు నటిస్తున్నారు. అతన్నే మళ్ళీ లీడర్ గా చూపించాలని శేఖర్ కమ్ముల ఆశపడుతున్నారు. ఫిదా మూవీని మహేష్ కోసమే రాసారు. అతను నో చెప్పడంతో వరుణ్ తేజ్ కి వెళ్ళింది. మళ్ళీ ఈ లీడర్ 2 కథని మహేష్ ఒప్పుకుంటారా? ఇద్దరి కాంబినేషలో మూవీ వస్తుందా? రాదా? అనేది కాలమే చెప్పాలి.