Shiva Jyothi: బిగ్ బాస్ శివజ్యోతికి అలాంటి కష్టాలా.. ఆ ఇల్లు అమ్మేస్తున్నారా?

తీన్మార్ వార్తల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో శివజ్యోతి ఒకరు. శివజ్యోతి తన టాలెంట్ ద్వారా, వార్తలు చదివి విధానం ద్వారా అభిమానులకు ఎంతగానో దగ్గరయ్యారు. శివజ్యోతి వ్యక్తిగత జీవితం గురించి కొన్నిరోజుల క్రితం వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. తాజాగా హోం టూర్ వీడియో చేసిన శివజ్యోతి ఈ వీడియోలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడే టాలెంట్ ఉన్న శివజ్యోతి జ్యోతక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

యూట్యూబ్ లో మణికొండలో మేము తీసుకున్న మొదటి ఇల్లు ఇది అని ఆమె అన్నారు. 2019లో ఈ ఇల్లు కొనుక్కున్నామని 2020లో గృహ ప్రవేశం చేశామని శివజ్యోతి వెల్లడించారు. గృహప్రవేశం చేసిన నెల రోజులకే లాక్ డౌన్ వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. కొన్నిరోజుల క్రితం ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యామని శివజ్యోతి పేర్కొన్నారు. తనకు వచ్చిన అవార్డుల గురించి ఆమె చెప్పుకొచ్చారు. నచ్చిన ఇంటీరియర్ తో ఇంటిని డిజైన్ చేయించుకున్నానని ఆమె అన్నారు.

అయితే తాను వీడియో చేసిన ఈ ఇంట్లో ఇకపై ఉండటం లేదని చెప్పి శివజ్యోతి షాకిచ్చారు. లాక్ డౌన్ సమయంలో 2 లక్షల రూపాయల అప్పు చేసి ఈ ఇంట్లోకి వచ్చానని ఆమె కామెంట్లు చేశారు. కొత్త న్యూస్ ఛానల్ వర్కౌట్ కాకపోవడంతో డిప్రెషన్ కు లోనయ్యానని శివజ్యోతి చెప్పుకొచ్చారు. నాకు ఇంకో ఇల్లు ఉందని రెండు ఇళ్లకు సంబంధించిన ఈ.ఎం.ఐలను చెల్లించడం కష్టంగా ఉందని ఆమె అన్నారు.

అందువల్ల ఈ ఇంటిని అమ్మాలని నిర్ణయం తీసుకున్నానని శివజ్యోతి (Shiva Jyothi) తెలిపారు. నన్ను ఊరికే తిట్టవద్దని అలా తిడితే ఆ ఎఫెక్ట్ నాపై పడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. శివజ్యోతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus