Shiva Rajkumar: పునీత్ చనిపోయాడని అంగీకరించలేను.. శివన్న కామెంట్స్ వైరల్!

శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. కన్నడనాట ఈ సినిమా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదలవుతుండగా ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురవుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే ఘోస్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివన్న పునీత్ ను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.

పునీత్ చనిపోయాడని అంగీకరించలేనని శివన్న చెప్పుకొచ్చారు. పునీత్ మరణం నమ్మలేని, ఒప్పుకోలేని నిజం అని ఆయన చెప్పుకొచ్చారు. పునీత్ వయస్సులో నాకంటే 12 సంవత్సరాలు చిన్నవాడని పునీత్ గురించి నా భావాలను ఎక్స్ ప్రెస్ చేయలేనని శివరాజ్ కుమార్ తెలిపారు. పునీత్ సమాధి దగ్గరకు వెళ్లడం, అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించడం తాను చేయనని పునీత్ మరణించాడని అంగీకరిస్తే మాత్రమే ఇలాంటివి ఆలోచిస్తామని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.

ఘోస్ట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మూడు గెటప్స్ లో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. శివరాజ్ కుమార్ కథ నచ్చితే కామియో రోల్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. జైలర్ మూవీ సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించిన శివరాజ్ కుమార్ మంచు విష్ణు కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ లో నటించిన సినిమాలకు కన్నడనాట భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

బాలయ్య కొంతకాలం క్రితం (Shiva Rajkumar) శివరాజ్ కుమార్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివరాజ్ కుమార్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంది. శివరాజ్ కుమార్ అన్ని భాషల సినిమాలలో నటిస్తూ అందరివాడు అనిపించుకుంటున్నారు. శివరాజ్ కుమార్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus