కావాలనే ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారు : శివారెడ్డి
- January 10, 2020 / 07:03 PM ISTByFilmy Focus
కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించిన శివారెడ్డి.. మిమిక్రీ ఆర్టిస్ట్ గా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు నటించిన చాలా చిత్రాల్లో హీరోలను ఇమిటేట్ చేస్తూ ఆడియన్స్ ని నవ్వించాడు. అయితే చాలా కాలంగా అతడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ఈ విషయం ఆయన వద్ద ప్రస్తావించగా.. తను కావాలని ఇండస్ట్రీకి దూరం కాలేదని.. అవకాశాలు రాక దూరమయ్యానని చెబుతున్నారు. తను ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదని.. చాలా మందికి సహాయం చేశానని అలాంటిది తనను ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టిందో అర్ధం కావడం లేదని అన్నారు.

దాసరి నారాయణరావు, చిరంజీవి లాంటి పెద్దలు తన టాలెంట్ గుర్తించి గొప్పగా మాట్లాడారని.. కానీ అవకాశాలు మాత్రం రాలేదని అన్నారు. ఇండస్ట్రీలో పనిచేసినంత కాలం ఎంతో ఎంజాయ్ చేశానని.. తనకు అంతే రాసి పెట్టి ఉందని చెప్పుకొచ్చారు. తనకు అవకాశాలు ఇస్తే మాత్రం కష్టపడి పని చేస్తానని అన్నారు. ఇక ఇండస్ట్రీలో శివారెడ్డిని తొక్కేశారని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. అది నిజమేనని అన్నారు. ఇప్పటివరకు తనను తొక్కేసిన వ్యక్తి పేరు బయటపెట్టలేదని.. తనకు అవకాశాలు రానప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు చెప్పలేదని తెలిపారు.
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!















