Shivani: నా వల్ల నాన్న ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి: శివాని

జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్‌ హీరోయిన్లుగా శివాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శేఖర్. ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజశేఖర్ కూతుర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శివాని వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేముందు కరోనా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే తాను కరోనా బారిన పడ్డానని, తన వల్ల తన తండ్రి కూడా కరోనా బారిన పడ్డారని శివాని తెలియజేశారు.అయితే తాను కరోనా నుంచి తొందరగా కోలుకొని బయటపడ్డాను తన తండ్రి మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, ఒకానొక సమయంలో డాక్టర్లు 50-50ఛాన్స్ అని చెప్పారని ఈమె ఈ సందర్భంగా గత విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

నాన్నని ఆ పరిస్థితుల్లో చూసి నాపై నాకే కోపం వచ్చింది. కేవలం తన కారణంగానే నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో బయట వాళ్ళు అందరూ నన్ను నష్ట జాతకురాలు అంటూ పిలిచారు. ఆ సమయంలో నాకు కూడా అదే అనిపించింది అంటూ ఈమె తన తండ్రి పడిన ఇబ్బందులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. భగవంతుడి దయవల్ల నాన్న ఆరోగ్యం నుంచి కోలుకుని బయటపడ్డారు అంటూ శివాని ఎమోషనల్ కాగా ఈమె మాటలు విని శివాత్మిక కూడా ఎమోషన్ అయ్యారు.

ఇక ఈ సినిమా గురించి శివాని మాట్లాడుతూ ఈ సినిమా కోసం నాన్న ఎంతో కష్టపడ్డారని, కరోనా వచ్చినప్పటికీ ఈ సినిమాలో చాలా నాచురల్ గా ఉండాలి అంటూ సిగరెట్ కాలుస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేశామని, ఇక ఈ సినిమాకి అమ్మ డైరెక్షన్ చాలా అద్భుతంగా వచ్చిందని ,ఈ సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని ఈ సందర్భంగా శివాని శేఖర్ సినిమా గురించి వెల్లడించారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus