Shivani Nagaram : సింపుల్ ఫొటోస్ తో మరోసారి ‘లిటిల్ హార్ట్స్’ ను మైమరిపిస్తున్న కాత్యాయని..!

Shivani Nagaram : ఇటీవల సోషల్ మీడియాలో ఓ నేచురల్ బ్యూటీ ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఎవరో కాదు.. సింపుల్ ఫొటోలతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న హీరోయిన్ శివాని నాగారం. లిటిల్ హార్ట్స్ సినిమాతో యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సింపుల్ పిక్స్‌తో అభిమానులను మైమరిపిస్తోంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ మేకప్ లేకుండా, సహజమైన చిరునవ్వుతో కనిపించిన ఆమె లుక్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. “సింప్లిసిటీనే అసలైన స్టైల్” అన్నట్టుగా ఈ ఫొటోలు ఆమె ప్రత్యేకతను మరోసారి చాటుతున్నాయి.

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో మొదట ప్రేక్షకులకు పరిచయమైన శివాని, ఆ తర్వాత సంచలన బ్లాక్ బస్టర్ ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో నిజమైన బ్రేక్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన కాత్యాయని పాత్ర అంతగా ప్రభావం చూపింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికీ కూడా చాలామంది ఆమెను కాత్యాయని పేరుతోనే గుర్తుపట్టడం విశేషం. ఆ పాత్రకు సంబంధించిన పాటలు, డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా కాత్యాయని పాట రీల్స్‌గా మారి యువతను బాగా ఆకట్టుకుంది.

వ్యక్తిగత జీవితానికి వస్తే, శివాని పుట్టుకతోనే హైదరాబాద్ అమ్మాయి. చిన్ననాటి నుంచే సంగీతం, నృత్యం ఆమె జీవితంలో భాగమయ్యాయి. కూచిపూడి శిక్షణ పొందిన ఆమె, నటిగా కాకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ లేదా మ్యూజిక్ ఫీల్డ్‌లో ఉండేదానినని పలుమార్లు చెప్పింది. ఫ్యాషన్ విషయంలో కూడా ఆమె స్టైల్ చాలా సింపుల్. రోజువారీగా టీషర్ట్, జీన్స్ ఇష్టపడే శివాని, పండుగలప్పుడు మాత్రం పట్టు చీరలో సంప్రదాయ తెలంగాణ అమ్మాయిలా మెరిసిపోతుంది.

Megastar : చిరంజీవి తో పోటీకి సై అంటున్న బన్నీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus