Shivani Rajashekar: నాన్న బెడ్ పై ఉన్న నాకు ధైర్యం చెప్పారు!

జీవిత రాజశేఖర్ కుమార్తెగా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి శివాని రాజశేఖర్. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో స్టార్ సక్సెస్ అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈమెకు పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. తాజాగా కోటబొమ్మాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఎంతో మంచే సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా శివాని (Shivani Rajashekar) మాట్లాడుతూ ఒకానొక సమయంలో తన తండ్రి ఆరోగ్యం గురించి తాను ఎంతో కంగారుపడ్డానని తెలిపారు. ఆమె గుండె దడ వంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారట అయితే తన తండ్రి తనకు చికిత్స చేస్తూ ఉండేవారు సర్జరీ వరకు వెళ్లకుండా మందులతోనే దానిని బాగు చేయించాలని మెడిసిన్స్ వాడుతూ ఉండే దానిని నెలకి ఒకసారి మాత్రమే అలాంటి సమస్య వచ్చేదని తెలిపారు. ఇక నాన్నతో కలిసి నేను శేఖర్ సినిమాలో నటించాను.

ఈ సినిమా సమయంలో నాకు కోవిడ్ వచ్చింది అయితే నాకు కరోనా రావడంతో నాన్నకు కూడా వచ్చిందని నాన్న పరిస్థితి మాత్రం చాలా సీరియస్ అయిందని శివాని తెలిపారు. శాచురేషన్ 60కి పడిపోయిందని వెంటిలేటర్ పైకి తీసుకువెళ్లాలి అంటు డాక్టర్లు మాట్లాడుతున్నారు నాన్న పరిస్థితి చూసి అందరూ చాలా కంగారు పడ్డామని శివాని తెలిపారు. అలాంటి సమయంలో నా జాతకం గురించి నాకే సందేహాలు వచ్చాయని తెలిపారు. నా కారణంగానే నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చింది

బహుశా నా జాతకమే బాగా లేదేమో మా ఇంటికి నేనే దరిద్రం ఏమో అంటూ ఎన్నో ఆలోచనలు చేశాను కానీ నాన్న బెడ్ పై ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నా గురించి ఆలోచించారని నేను ఎక్కువగా కంగారు పడితే నా సమస్య మరింత ఎక్కువ అవుతుందని నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజుకు రెండు మూడు సార్లు నేను నా సమస్యతో బాధపడేదాన్ని అని తెలిపారు. అయితే నాన్న ఆ పరిస్థితులలో బెడ్ పై ఉన్నప్పటికీ నువ్వు కంగారు పడకు నువ్వు కంగారు పడితే నీకు సమస్య వస్తుంది అంటూ నాన్న నాకెంతో ధైర్యం చెప్పారు అంటూ అప్పటి విషయాలను ఈమె గుర్తు చేసుకున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus