నేను ఆ పని చేసినట్లు అమ్మానాన్నలకు అసలు తెలియదు: శివాని

  • February 27, 2023 / 04:53 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజశేఖర్ జీవిత దంపతుల గురించి మనకు తెలిసిందే. ఇలా ఇద్దరు హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి వారసురాలుగా ఇప్పటికే ఇండస్ట్రీలో శివాని శివాత్మిక హీరోయిన్లుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ హీరోయిన్లుగా గుర్తింపు పొందడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు.ఈ విధంగా శివానీ, శివాత్మిక ఇద్దరు సినిమాలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేశారు.

ఇకపోతే ఈమె వృత్తిపరంగా వైద్య విద్యను అభ్యసిస్తోంది. అలాగే మోడల్ గా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. శివాని ఫెమినా మిస్ ఇండియా 2022 ఫైనలిస్ట్ గా నిలిచింది. ఇలా ఒకవైపు మోడలింగ్ రంగంలోనూ మరోవైపు ఉన్నత చదువులు చదువుతూ మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ శివాని మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. తాజాగా ఈమె హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఆహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ వెబ్ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విధంగా సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోని తాను చిన్నప్పుడు పెద్ద ఎత్తున బొంగరాలు దొంగతనం చేసేదాన్ని తెలిపారు.

ఇంటికి తెచ్చుకొని ఎవరికి తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనంద పడిపోయేదాన్ని అని తెలియజేశారు.అయితే ఈ విషయం ఇప్పటివరకు అమ్మానాన్నలకు తెలియదు అంటూ ఈమె ఈ విషయాన్ని బయట పెట్టారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus