Shoban Babu: శోభన్‌బాబు ఇప్పుడు పుట్టి ఉంటే… ఇలానే ఉండేవాడా?
- January 10, 2024 / 07:13 PM ISTByFilmy Focus
తెలుగు సినిమా చరిత్రలో అందగాడు అంటూ ఓ లిస్ట్ రాయడం మొదలుపెడితే తొలి పేరు శోభన్ బాబు అవుతుంది. ఈ మాట మేం అనేది ఆనాటి సినిమా అభిమానులు, ఈ నాటి సినిమా పరిశీలకులు చెప్పే మాట ఇది. తెలుగు హీరోలు అంటే ఓ రకంగా ఉంటారు అనే ఆలోచనను పటాపంచలు చేసిన కథానాయకుడు ఆయన. అందంలో హాలీవుడ్ హీరోలు ఆయన ముందు దిగదిడుపే అనేవారట ఆ రోజుల్లో సినిమా ఫ్యాన్స్. నటన పరంగా ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నా అందంలో మాత్రం ఆయనే గ్రేట్.
ఇప్పుడు శోభన్‌బాబు గురించి ఎందుకు చర్చ వచ్చింది అంటే… ఆయన పుట్టిన రోజు దగ్గరకొస్తోంది కాబట్టి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సిద్ధం చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా ఓ కారణం. ఏఐ వల్ల ఉపయోగం ఎంత ఉందో.. అంతకంటే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటుంటారు. సినిమా వాళ్లను అభ్యంతరకరంగా మార్చి ఇబ్బంది పెట్టిన డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు ఓ మంచి కూడా చేసింది. అదే శోభన్‌బాబు వీడియో.

శోభన్ బాబు అందమైన హీరో అని మాత్రమే నేటి తరం వాళ్లకు తెలుసు. అయితే ఆయన రూపం ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందో ఆ డీప్‌ఫేక్ వీడియోలో చూపించారు. ఆ వీడియో చూసి నెటిజన్లు ‘వావ్’అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో శోభన్ బాబు సముద్రం ఒడ్డున అలా నడిచి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ కటౌట్‌లా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శోభన్‌బాబు (Shoban Babu) సంగతి చూస్తే.. హీరోగా మొదలై తన కెరీర్‌ను, లైఫ్‌ను హీరోగానే ముగించారు. తనను అభిమానులు హీరోగానే చూడాలనుకుంటారని, అందుకే ఇతర పాత్రలను పోషించనని భీష్మించుకుని కూర్చున్నారు. అనుకున్నట్లుగానే ఎన్ని సినిమా ఛాన్స్‌ల్లో సహాయ నటుడి పాత్రలు వచ్చినా ఒప్పుకోలేదు. అదే విధంగా ఆర్థికంగా కూడా ఆయన చాలా డిసిప్లీన్‌గా ఉన్నారు. ఎందుకంటే సౌత్ ఇండియా నటుల్లో ఆయనే రిచెస్ట్.
Artificial intelligence created Sobhan Babu https://t.co/HLkSS9va24
— Ram Gopal Varma (@RGVzoomin) January 10, 2024
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!
















