Shobha Shetty: అదృష్టమంటే శోభాశెట్టి లా ఉండాలని కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

శోభ శెట్టి ప్రస్తుతం ఈ పేరు తెలియని వాళ్లు లేరు. కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా పాత్ర పోషించి అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అమ్మడు ట్రోఫీ గెలవక పోయిన టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు. టాప్ 5కి ఒక్క అడుగు దూరం నుండే వెనక్కి వచ్చేసింది. 14వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా శోభ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చేసింది .

ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజి పైకి వచ్చి ఏడ్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నిజానికి సోభాశెట్టి హౌస్ లో గేమ్ ఆడింది అనడం కన్నా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనడం కన్నా టిఆర్పి రేటింగ్స్ బాగా పెంచడానికి ట్రై చేసిందని చెప్పాలి. అనవసర విషయాలలో తల దూర్చడం కచ్చితంగా ఆ వారం ఆ ఎలిమినేట్ అవ్వకుండా ఉండేలా నలుగురితో మంచిగా ఉంటూ ఎవరైతే తనకు యాంటీగా ఉన్నారో వాళ్లను టార్గెట్ చేయడం అలాంటి పనులు బాగానే చేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన శోభా శెట్టిని చూసి ఫాన్స్ కుమిలిపోతున్నారు . టాప్ ఫైవ్ లో ఉండాల్సింది అక్క అంటూ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు . అయితే శోభ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా సరే మంచి బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . చిరంజీవి సినిమాలో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట .

ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం (Shobha Shetty) ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు వశిష్ట అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు శోభ శెట్టి ఫ్యాన్స్ కూడా చిరంజీవి సినిమా అంటే 100 బిగ్ బాస్ ట్రోఫీలతో సమానం .. డోంట్ వర్రీ అంటూ సముదాయిస్తున్నారు. మరి కొంత మంది అదృష్టమంటే ఇలా ఉండాలని కామెంట్స్ చేసున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus