Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్ 7’ రూపంలో శోభా శెట్టి గట్టిగానే అందుకుందిగా..!

బిగ్ బాస్ సీజన్ 7 లో 8 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ‘కార్తీక దీపం’ ఫేమ్ శోభా శెట్టి. మొదటి నుండి ఆమె టాప్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకుంది. ప్రతి గేమ్ లో తన బెస్ట్ ఇచ్చేది. కానీ కొన్ని సార్లు తోటి కంటెస్టెంట్స్ తో ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకునేది. అందువల్ల ఈమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసేది. ఆ నెగిటివిటీ వల్ల ఈమె చాలా రోజుల క్రితమే ఎలిమినేటి అయిపోద్ది అనుకున్నారు.

కానీ ఈమె వల్లే టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వస్తుంది అనో ఏమో కానీ.. బిగ్ బాస్ ఈమెను హౌస్లో ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈమె తప్పకుండా టాప్ 5 కంటెస్టెంట్ గా నిలుస్తుంది అనుకున్న తరుణంలో మొత్తానికి ఈమె 14 వ వారంలో బయటకి వచ్చింది. శోభా శెట్టి హౌస్ నుండి బయటకి రాగానే ముందుగా బయటకి వచ్చేసిన తన ఫ్రెండ్స్ తో గెట్ టు గెదర్ అయ్యింది. అయితే ఎక్కువగా ఇంటర్వ్యూలు మాత్రం ఈమె ఇవ్వడం లేదు.

అయితే 13 వారాలకి గాను (Bigg Boss 7 Telugu) ఈమె ఎంత పారితోషికం అందుకుని ఉంటుంది? అనే ప్రశ్న మాత్రం అందరిలోనూ ఉంది. వారానికి రూ.2.5 లక్షల చొప్పున ఈమె రూ.30 లక్షల వరకు పారితోషికం అందుకుంది అని ఇన్సైడ్ టాక్. ఆ రకంగా చూసుకుంటే ‘బిగ్ బాస్ 7 ‘ ఈమెకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే శోభా శెట్టికి ‘కార్తీక దీపం’ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus