Shobha Shetty: బిగ్ బాస్ బజ్ లో షాకింగ్ విషయాలు చెప్పిన శోభ.. అది తెలియదంటూ?

బిగ్ బాస్ షో సీజన్7 14వ వారంలో హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులర్ అయిన శోభాశెట్టి బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు. శోభాశెట్టి గేమ్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నా ఆమె బిహేవియర్ మాత్రం ఎక్కువమంది ప్రేక్షకులకు నచ్చలేదు. 14వ వారం ఎలిమినేట్ అవుతానని శోభాశెట్టి ముందుగానే ఊహించగా ఆమె ఊహించినట్టే జరిగింది. కొంతమంది బిగ్ బాస్ దత్త పుత్రిక శోభాశెట్టి అంటూ కామెంట్లు చేశారు.

అయితే బిగ్ బాస్ బజ్ లో శోభా శెట్టి మాట్లాడుతూ తాను హౌస్ లో గేమ్ ను టార్గెట్ చేశానే తప్ప ఎవరినీ టార్గెట్ చేయలేదని అన్నారు. తేజ కోసం బిగ్ బాస్ కు రాలేదని తేజని తలచుకుని సింపతీ పొందాలని అనుకోలేదని ఆమె తెలిపారు. ప్రియాంక నా ఫ్రెండ్ అయినా సపోర్ట్ చేయనని నాకు అమర్ దీప్ గెలవాలని ఉందని శోభా శెట్టి అన్నారు.

శివాజీ స్ట్రాటజీతో మైండ్ గేమ్ ఆడుతున్నాడని బిగ్ బాస్ లో ఉండాలంటే మెంటల్ గేమ్ ఆడటం అవసరమని ఆమె తెలిపారు. శివాజీ జనాలకు ఏది చేస్తే నచ్చుతుందో ఆలోచించి మరీ ఆడుతున్నాడని అలా ఆడితే బిగ్ బాస్ విన్నర్ అయిపోవచ్చని శోభాశెట్టి పేర్కొన్నారు. అమర్ దీప్ మాట్లాడిన ఒక వీడియోను చూసిన శోభాశెట్టి ఈ వీడియో గురించి నాకు తెలియదని హౌస్ లో ఈ వీడియోను చూపించాల్సిందని తెలిపారు.

గీతూ రాయల్ అడిగిన చాలా ప్రశ్నలకు శోభా శెట్టి సమాధానాలను దాటవేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శోభాశెట్టి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. తనపై వస్తున్న నెగిటివిటీకి ఆమె ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది. శోభా శెట్టి ఎలిమినేట్ కావడంతో ఆమెకు సంబంధించిన మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శోభా శెట్టి (Shobha Shetty) కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus