బిగ్ బాస్ హౌస్ లో ఓట్ అప్పీల్ కోసం పెట్టిన ఫన్ టాస్క్ లు ఇప్పుడు హౌస్ టాప్ లేచిపోయే గొడవలకి కారణం అవుతున్నాయి. శోభా శెట్టి యావర్ తో మొదలైన ఈ గొడవ తర్వాత అమర్ పల్లవి ప్రశాంత్ కొరుక్కుని కొట్టుకునేంత వరకూ వెళ్లింది. అమర్ అయితే పల్లవి ప్రశాంత్ ని తీసిపారేస్తున్నట్లుగా మాట్లాడుతూ మరీ రెచ్చిపోయాడు. హిస్టిరీయా వచ్చిన పేషెంట్ లాగా , పిచ్చి పట్టినట్లుగా ఎమోషనల్ అయిపోయాడు. అసలు అంతగా కోపం ఎందుకు వచ్చింది ? కేవలం కెప్టెన్సీలో సపోర్ట్ చేయకపోతేనే అంతలా ఫీల్ అవ్వాలా ?
ఇంతవరకూ మంచిగా ఉన్న శోభాశెట్టి కూడా శివాజీపై ఎందుకు విరుచుకుని పడిందనేది ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ కి అర్ధం కావడం లేదు. అసలు నిజాలు ఏంటి ? తెరవెనుక ఏం జరుగుతోందనేది మనం ఒక్కసారి చూసినట్లయితే., బిగ్ బాస్ హౌస్ లో గత ఆదివారం గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీపాస్ అనేది వాడకుండా, ఎవ్వరికీ పనికి రాకుండా వేస్ట్ చేసేశాడు. అంతేకాదు, నాగార్జున వెళ్లిపోతూ హౌస్ మేట్స్ కి ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటూ సేవింగ్ ఆర్డర్ కి ఇంకా ఓటింగ్ ఆర్డర్ కి చాలా తేడా ఉంటుందని చెప్పాడు.
మీరు ఎలా సేఫ్ అవుతారో అలాగే ఉన్నట్లు కాదని చెప్పాడు. కానీ, బోటమ్ 2 మాత్రం మారదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే, అర్జున్ ఫినాలే టిక్కెట్ కానీ గెలుచుకోకపోతే ఈవారం ఎలిమినేట్ అయిపోయేవాడని ఓటింగ్ లో లీస్ట్ అర్జునే ఉన్నడని చెప్పాడు. దీన్ని బట్టీ హౌస్ లో లెక్కలు వేసుకున్నారు. సీరియల్ బ్యాచ్ అయిన శోభాశెట్టి, ప్రియాంక, ఇంకా అమర్ దీప్ లు మనం లీస్ట్ లో ఉన్నామా ? శివాజీ గ్రూప్ టాప్ లో ఉందా ? అని అంచనాలు వేసుకున్నారు. అంతేకాదు, దీనిపైన డిస్కషన్స్ కూడా పెట్టారు. ఓట్ అప్పీల్ కి వచ్చేటపుడు ఇదే మైయిన్ రీజన్ గా చూపిస్తున్నారు.
అందుకే, పార్టిసిపెంట్స్ మద్యలో గొడవలు అయిపోతున్నాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ – యావర్ టాప్ లో ఉన్నారనేది సీరియల్ బ్యాచ్ జీర్ణించుకోలోకపోతున్నారు. హౌస్ లో పని అంతా మనమే చేస్తున్నా కూడా ఎక్కడా గుర్తింపు లేదని బాధపడుతున్నారు. ముఖ్యంగా శోభాశెట్టి శివాజీ అసలు ఎలిమినేట్ అవ్వకుండా ఇంతకాలం ఎలా ఉన్నారనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. టాస్క్ లు కూడా ఆడట్లేదు, అస్సలు గేమ్ లో పార్టిసిపేషన్ లేదు అయినా కూడా సేవ్ అవుతూ వస్తున్నారని సందేహ పడింది. అంతేకాదు, ముగ్గురు సీరియల్ బ్యాచ్ డిస్కస్ చేస్కుని శివాజీ అండతోనే వాళ్లు చెలరేగుతున్నారని,
ఈసారి మాత్రం ఎలాగో హౌస్ (Bigg Boss 7 Telugu) నుంచీ వెళ్లిపోతున్నా అని తెలిసింది కాబట్టి రెచ్చిపోవడమే అంటూ శోభాశెట్టి శివాజీ ఎప్పుడు దొరుకుతాడా అని వైయిట్ చేసింది. బాల్స్ టాస్క్ లో ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కేయాలని చూసింది. శివాజీకి మాటకి మాట చెప్తూ రెచ్చగొట్టింది. దీంతో శివాజీ కూడా కౌంటర్స్ వేస్తూ బరెస్ట్ అయ్యాడు. కానీ, అప్పటి వరకూ వీళ్ల గేమ్ ప్లాన్ తెలుసుకున్న శివాజీ యావర్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అంతకు ముందు నామినేషన్స్ అవ్వగానే పల్లవి ప్రశాంత్ కి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇంతకాలం 14వారాలు ఆడిన గేమ్ ఒక్క దెబ్బతో పోతుందంటూ సహనంగా ఉండమని సలహా ఇచ్చాడు.
అంతేకాదు, సమయం దొరికినప్పుడల్లా సీరియల్ బ్యాచ్ గేమ్ ఎలా ఆడుతుందో, వాళ్లు ఎంత నెగిటివ్ పీపులో కెమెరాలకి చెప్తునే ఉన్నాడు శివాజీ. అందుకే, శోభా అవకాశం కోసం చూసి స్పై బ్యాచ్ ని టార్గెట్ చేసింది. ఉంటే ఉంటాం, పోతే పోతాం అనే థోరణిలోనే గేమ్ స్టార్ట్ చేశారు. అనుకున్నట్లుగానే స్పై బ్యాచ్ ని డిస్టర్బ్ చేశారు. వాళ్ల సహనానికి పరీక్ష పెట్టారు. మొత్తానికి ఫన్ టాస్క్ అన్న బిగ్ బాస్ కాస్త ఇప్పుడు ఇది గొడవల టాస్క్ గా మారిపోయింది. మరి దీనిపైన వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!