RRR: ఇంతగా దిగజారుతారా..? ‘బాహుబలి’ నిర్మాత ఫైర్!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను సోషల్ మీడియా వేదికగా కొందరు ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ సినిమాను గే లవ్ స్టోరీగా అభివర్ణిస్తున్నారు. అక్కడివారు అలా కామెంట్స్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు కానీ మన దేశానికి చెందిన వారు కూడా అలానే అనడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి, అందులోనూ ఆస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తి కావడం గమనార్హం.

పలు సినిమాలకు సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన రసూల్ పూకుట్టి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గే స్టోరీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ‘బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రసూల్ పై ఫైర్ అయ్యారు. రసూల్ పూకుట్టిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు శోభు యార్లగడ్డ. ”నువ్ చెప్పినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గే స్టోరీలా నాకు అనిపించలేదు.

ఒకవేళ గే స్టోరీ అయినా తప్పేంటి..? అదేమైనా చెడ్డ విషయమా..? నువ్ అలా ఎలా అంటావ్..? నీ వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకోగలవు.. మీరు ఇలా దిగజారడం నాకు ఎంతో బాధగా అనిపిస్తోంది” అంటూ శోభు యార్లగడ్డ రాసుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి చర్చకు దారి తీసింది. ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్స్, అక్కడి క్రిటిక్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

చాలా దేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయినా కొంతమంది ఈ సినిమాపై చెత్త కామెంట్స్ చేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus