Prabhas: చిన్నప్పుడు ఆ డ్రెస్ కావాలని ప్రభాస్ మారాం చేశారా.. ఏమైందంటే?

  • May 23, 2024 / 12:12 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మరో నెల రోజుల్లో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాపై బజ్ అంతకంతకూ పెరుగుతోంది. కల్కి సినిమాకు సంబంధించి తాజాగా జరిగిన ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ చిన్నప్పుడు కమల్ (Kamal Haasan)  నటించిన సాగరసంగమం సినిమా చూసి సినిమాలో కమల్ వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్ కావాలని మారాం చేశానని తెలిపారు. ఆ డ్రెస్ వేసుకుంటే నేను కూడా కమల్ హాసన్ లా డ్యాన్స్ చేయవచ్చని భావించానని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

అయితే కమల్ హాసన్ లా తల కూడా తిప్పలేకపోయానని ఆయన అన్నారు. మరోవైపు ప్రభాస్ బుజ్జిని పరిచయం చేయగా ఈ వాహనం సినిమాలో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బుజ్జి గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన పెద్ద సినిమాలేవీ విడుదల కాక ప్రేక్షకులు సైతం మంచి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కల్కి 2898 ఏడీ ఆ లోటును తీర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి ట్రైలర్ కు సంబంధించి అప్ డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సలార్ (Salaar) సక్సెస్ తో క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో తన గత సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. కల్కి సినిమా ఇతర భాషల్లో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus