Tollywood: తెలుగు తెరపై ఊహించని కాంబోలు.. సూపర్‌

టాలీవుడ్‌లో ఏం జరిగినా ఓపెన్‌ సీక్రెట్‌ అంటారు. ఎలా బయటకు వస్తాయో కానీ… కొత్త కాంబినేషన్ల విషయాలు బయటకు వచ్చేస్తుంటాయి. ఓ రెండు, మూడు నెలలు అందరి నోళ్లలో నాని ఆ తర్వాత అఫీషియల్‌ అవుతాయి. కానీ గత కొన్ని రోజులుగా చూస్తే టాలీవుడ్‌లో షాకింగ్‌ కాంబినేషన్లు అనౌన్స్‌ అవుతున్నాయి. వాటి గురించి అంతకుముందు ఎక్కడా చర్చ లేకపోవడం గమనార్హం. అసలు ఆ కాంబినేషన్లు ఎవరూ ఊహించనవి కావడం విశేషం. చిరంజీవి – సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా అలాంటిదే.

Click Here To Watch

టాలీవుడ్‌లో కాంబినేషన్లకు పెద్ద పీట వేస్తారు. హిట్ దర్శకుడు, హిట్‌ హీరో… అంటూ లెక్కలేసేస్తారు. ఈ కాంబినేషన్ల విషయంలో అఫీషియల్‌ సమాచారం రాకముందే లీకులు బయటకు వచ్చేస్తాయి. దీంతో అసలు అనౌన్స్‌మెంట్‌ వచ్చేసరికి వాటి మీద అంత ఆసక్తిఉండదు. అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేని తుపానులా గా కొన్ని అనౌన్స్‌మెంట్‌లు వస్తుంటాయి. లేదంటే ఒకటి రెండు రోజుల ముందే లీకులు వస్తుంటాయి. ఎప్పుడూ చర్చల్లోని సినిమాలు కూడా ఇలాంటివే.

ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని వార్త. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ… సినిమా పేరుతో సహా మొత్తం వివరాలు బయట ఉన్నాయి. సినిమా పేరు ‘రాజా డీలక్స్‌’ అని, ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వార్తలు బయటికొచ్చాయి. ప్రస్తుతం కథతో కుస్తీపడుతున్నారని, త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ అని టాక్‌. ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాల మధ్యలో చిన్న సినిమాగా ఇది వస్తుందట. అసలు ఈ ప్రాజెక్ట్‌ ఇన్ఫో వచ్చే ముందు ఎక్కడా కాంబో మీద చర్చే లేదు.

విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా పూర్తవుతున్న తరుణంలో ‘జన గణ మన’ టాక్‌ వచ్చింది. అప్పుడెప్పుడో పూరి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాను విజయ్‌ దేవరకొండతో చేయాలని పూరి నిర్ణయించారట. నిజానికి విజయ్‌ ‘లైగర్‌’ తర్వాత సుకుమార్‌, శివ నిర్వాణతో సినిమాలు చేయాల్సి ఉంది. కానీ పూరి సినిమా అనూహ్యంగా మధ్యలోకి వచ్చింది.

ఇటీవల కాలంలో ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చిన మరో అంశం. చిరంజీవి ఫ్యూచర్‌ సినిమాలు. చిరంజీవి – సుకుమార్‌ సినిమా అంటూ మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఓ యాడ్ కోసం చిరంజీవిని సుకుమార్‌ డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఆ విషయాన్ని ఆయన నేరుగా చెప్పకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో అందరూ సినిమా అనుకున్నారు. అయితే ఆ తర్వాత చిరంజీవి టీమ్‌ నుండి ఇది యాడ్‌ అని వార్త వచ్చింది. అంతేకాదు సినిమా కూడా చర్చల్లో ఉంది అని చెప్పారు. ఆఖరి మాట ఇప్పుడే నమ్మలేం.

చిరంజీవితోనే మరో సినిమా ఇలానే అనౌన్స్‌ అయ్యింది. అదే వెంకీ కుడుముల సినిమా. ఈ సినిమా గురించి ఎక్కడా చర్చ లేకుండానే ఓకే అయిపోయింది. అనౌన్స్‌ కూడా అయిపోయింది. బాబీ – మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందట. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో మెగాస్టార్‌ను వెంకీ డాన్‌గా చూపిస్తాడని టాక్‌.

ఇక మరో రీసెంట్‌ షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటే రామ్‌ – బోయపాటి శ్రీను సినిమా అని చెప్పొచ్చు. ఎలాంటి చర్చలు, లీకులు లేకుండా సినిమాకు గ్రౌండ్‌ సిద్ధం చేశారు. ‘అఖండ’ తర్వాత బోయపాటి సినిమా అల్లు అర్జున్‌తోనే అన్నారు. ఆ మేరకు చర్చలు కూడా సాగాయి. కానీ లెక్క మారి బోయపాటి తన నెక్స్ట్ సినిమాను రామ్‌తో అనౌన్స్‌ చేశారు. అంతేకాదు ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus