ఈ సంక్రాంతికి ‘రెడ్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రామ్ తన తరువాతి చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. ద్విభాషా చిత్రంగా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం రూపొందనుందని కూడా ప్రకటించాడు.’శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ‘ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని ఆమెను సంప్రదిస్తున్నారట.
అంతేకాకుండా బడ్జెట్ కు సంబంధించిన ఎస్టిమేషన్లు కూడా వేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆ లెక్కలను బట్టి దర్శకనిర్మాతలు షాక్ కు గురవుతున్నట్టు టాక్. విషయం ఏమిటంటే.. ఈ బైలింగ్యువల్ మూవీకి ఏకంగా రూ.80కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్. చెప్పాలంటే రామ్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ అన్న మాట. ఫైనల్ గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి.. ఆ లెక్క పెరిగే అవకాశం కూడా ఉందట. ‘ఇస్మార్ట్ శంకర్’ తో రామ్ మార్కెట్ పెరిగింది అనేది వాస్తవం. అప్పటివరకూ థియేట్రికల్ పరంగా అతని మార్కెట్ 20కోట్లు ఉంటే.. ఆ చిత్రంతో రూ.40కోట్ల వరకూ అది పాకింది.
‘రెడ్’ చిత్రం 50శాతం సీటింగ్ కెపాసిటీతో కూడా రూ.20కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. అది కూడా డివైడ్ టాక్ తో..! ఇంత బడ్జెట్ రామ్ ను దృష్టిలో పెట్టుకుని పెట్టడంలో తప్పులేదు. కానీ అటు వైపు లింగు స్వామి విషయానికి వస్తే.. ఆయన తీసిన గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి. పందెం కోడి2 తెలుగులో హిట్టే కానీ తమిళంలో ఆడలేదు. ఇక సికందర్ అయితే భారీ నష్టాలను మిగిల్చింది. ఇలాంటి నేపథ్యంలో అతన్ని నమ్మి రూ.80కోట్లు బడ్జెట్ పెట్టడం.. అభిమానులను కాస్త కలవర పెట్టే అంశం.