పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా.. ట్రైలర్ బట్టి సినిమా అని ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్ చూసి, ఆ ట్రైలర్ కాస్తో కూస్తో ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే థియేటర్లకి వస్తున్నారు. ట్రైలర్ నచ్చలేదు అంటే కనీసం ఆ సినిమాను చూడడం కూడా లేదు. మహా అయితే.. ఏ యూట్యూబ్ లోనో లేక అమేజాన్ ప్రైమ్ లోనో చూసుకొంటున్నారు. అందుకే సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా.. ట్రైలర్ తో మాత్రం అంచనాలు పెంచేస్తున్నారు మన దర్శకులు.
అయితే.. నిన్న విడుదలైన ఆర్జీవి ట్రైలర్ తో వర్మ ఏం చెప్పాలనుకున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. “పవర్ ఆఫ్ ఆఫీసర్” అంటూ నిన్న విడుదల చేసిన “ఆఫీసర్” ట్రైలర్ లో కొత్త కట్స్ పెద్దగా ఏమీ లేవు, ఇప్పటివరకూ విడుదల చేసిన టీజర్స్ & ప్రోమోస్ అన్నీ కలిపి ట్రైలర్ గా రిలీజ్ చేసేశాడు. ఈ ట్రైలర్ చూశాక “ఆఫీసర్” సినిమా మీద ఉన్న కాసింత నమ్మకం కూడా పోయింది. మరి సినిమాగానైనా “ఆఫీసర్” కనీస స్థాయిలో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.