స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుకున్న సినిమా నుంచి ఫస్ట్ హంట్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమా టీజర్ కు హైలెట్ గా నిలిచాయి. గోపీచంద్ మలినేని బాలయ్యను పవర్ ఫుల్ రోల్ లో చూపించనున్నారని టీజర్ తో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్ అని బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గోపీచంద్ మలినేని ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. అయితే టీజర్ లోని డైలాగ్స్ కొంచెం బోల్డ్ గా ఉన్నాయని సినిమాలో కూడా డైలాగ్స్ అదే విధంగా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ డైలాగ్స్ బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రెండు విషయాలలో క్లారిటీ లేదని బాలయ్య ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ రెండు విషయాలకు సంబంధించి చిత్రయూనిట్ నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు విషయాలకు సంబంధించి స్పష్టత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య పుట్టినరోజున ఇంకా ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి. బాలయ్య అఖండ సినిమాకు 11 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా తర్వాత సినిమాకు ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా టీజర్ లో శృతి హాసన్ పాత్రకు ప్రాధాన్యత దక్కలేదు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!