సంక్రాంతి పండుగ కానుకగా మూడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా ఈ మూడు సినిమాలకు దాదాపుగా సమానంగా థియేటర్లు దక్కనున్నాయి. నైజాం, వైజాగ్ లో వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కుతుండగా కోస్తాంధ్రలోని మిగతా జిల్లాలలో వాల్తేరు వీరయ్య హవా ఉంది. సీడెడ్ లో మాత్రం వీరసింహారెడ్డి మూవీకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కుతున్నాయని సమాచారం అందుతోంది. సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది.
అయితే లిమిటెడ్ థియేటర్లలోనే సినిమాలు రిలీజ్ అవుతుండటంతో టికెట్ రేట్లు పెంచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్లు రికవరీ కావాలంటే టికెట్ రేట్లు పెంచడం మినహా మరో మార్గం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఏయే సినిమాలకు టికెట్ రేట్లు పెరుగుతాయో స్పష్టత రావాల్సి ఉంది. టికెట్ రేట్లు పెంచడం వల్ల ఆర్.ఆర్.ఆర్ మినహా మరే సినిమాకు ప్లస్ కాలేదని చాలామంది భావిస్తారు. మరి టాలీవుడ్ స్టార్ హీరోలు టికెట్ రేట్ల విషయంలో అదే పొరపాటును మళ్లీ చేస్తారా?
అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సంక్రాంతి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. సంక్రాంతి సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయలు కాగా సంక్రాంతికి రిలీజ్ కానున్న మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ఆయా హీరోల ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సంక్రాంతి సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల ట్రైలర్లు విడుదలైతే అంచనాలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సంక్రాంతి సినిమాలతో కచ్చితంగా సక్సెస్ సాధించాలని ముగ్గురు హీరోలు భావిస్తుండగా ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. వారసుడు మూవీ మాత్రమే పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదలవుతోంది.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!