Venkatesh: వెంకటేష్ స్టార్ హీరో కావడం వెనుక అసలు కథ ఇదే!

విక్టరీ వెంకటేష్ ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దృశ్యం2, ఎఫ్3, ఓరి దేవుడా సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్న వెంకటేష్ త్వరలో రానానాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మరణం కోట్ల సంఖ్యలో ప్రజలను బాధ పెట్టింది. అయితే వెంకటేష్ స్టార్ హీరో కావడం వెనుక కృష్ణ పాత్ర ఉందనే సంగతి చాలామంది అభిమానులకు తెలియదు. విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ కృష్ణ కోసం రాసిన కథ కావడం గమనార్హం. కృష్ణ రామానాయుడుతో ఈ సినిమాను మరో నిర్మాతతో కలిసి నిర్మించాలని సూచించారు.

రామానాయుడు గారు మాత్రం మరో నిర్మాతతో కలిసి సినిమాను నిర్మించడం తనకు ఇష్టం లేదని కృష్ణకు చెప్పారు. సోలోగా డేట్స్ ఇవ్వడానికి సమయం పడుతుందని చెప్పిన కృష్ణ చాలా రోజుల పాటు డేట్స్ ఇవ్వకపోవడంతో రామానాయుడు కోపంతో అమెరికాలో ఉన్న వెంకటేష్ ను ఇండియాకు పిలిపించి కలియుగ పాండవులు సినిమాలో హీరోగా నటించాలని సూచనలు చేశారు.

వెంకటేష్ ఇండియాకు వచ్చిన తర్వాత కేవలం 30 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని ఈ సినిమాలో నటించారు. కలియుగ పాండవులు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వెంకటేష్ కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్న వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus