Tollywood: దసరా థియేటర్ల లెక్కలో ఆ స్టార్ హీరోకే ప్రాధాన్యత.. కానీ?

  • August 15, 2023 / 05:04 PM IST

ఈ ఏడాది దసరా పండుగ కానుకగా బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలలో భగవంత్ కేసరి, లియో సినిమాల హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా హక్కులను ఏషియన్ సునీల్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే వరుస విజయాలతో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కుతున్నాయని తెలుస్తోంది.

లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు సైతం ఆయా సినిమాల క్రేజ్ కు అనుగుణంగా థియేటర్లను కేటాయించనున్నారని సమాచారం. సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి ఆ తర్వాత థియేటర్ల కేటాయింపులో మార్పులు జరగనున్నాయి. దసరా పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో బాలయ్య సినిమానే కలెక్షన్ల విషయంలో కూడా పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దసరా పండుగకు బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అనిల్ రావిపూడి ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. బాలయ్య అర్జున్ రాంపాల్ కాంబో సీన్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్దారని తెలుస్తోంది.

బాలయ్య సింగిల్ రోల్ లో ఈ సినిమాలో నటిస్తుండగా బాలయ్య, శ్రీలీల కాంబో సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం. బాలయ్యకు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భగవంత్ కేసరి ఇతర భాషల్లో కూడా విడుదలై అక్కడ కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus