రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖిలాడీ మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏపీలో పెద్ద సినిమాల రిలీజ్ కు అనుకూల పరిస్థితులు లేకపోయినా ఈ సినిమా మేకర్స్ రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు నాలుగు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ఈ సినిమా మేకర్స్ ప్రభుత్వాన్ని కోరనున్నారని సమాచారం. రాక్షసుడు తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమేష్ వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ వీర సినిమా ఫ్లాపైనా తన డైరెక్షన్ లో తెరకెక్కిన రాక్షసుడు సినిమా హిట్ కావడంతో రవితేజ తనకు అవకాశం ఇచ్చారని రమేష్ వర్మ చెప్పుకొచ్చారు. మొదట ఏదైనా రీమేక్ లో చేయడానికి రవితేజ ఆసక్తి చూపారని ఆ సమయంలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చతురంగ వైట్టై2 సినిమాను రవితేజకు చూపించామని రమేష్ వర్మ వెల్లడించారు.
చతురంగ వేట్టై2 రవితేజకు నచ్చినా ఆ సినిమా తన ఇమేజ్ కు ఏ మాత్రం సరిపోదని రవితేజ భావించారని రమేష్ వర్మ పేర్కొన్నారు. ఆ సమయంలో తన దగ్గర డబ్బుకు సంబంధించి ఉన్న కాన్సెప్ట్ ను రవితేజకు చెప్పానని 15 నిమిషాల్లో ఖిలాడీ కథ విని రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన అన్నారు. ఖిలాడీ ఇంటర్వెల్ గురించి మాట్లాడుతూ చతురంగవేట్టై2 ఇంటర్వెల్ కు ఈ సినిమా ఇంటర్వెల్ కు పోలిక ఉంటుందని రమేష్ వర్మ అన్నారు.
అయితే ఆ సినిమా హక్కులు తమ దగ్గరే ఉన్నాయి కాబట్టి లీగల్ గా ఏ సమస్య వచ్చే ఛాన్స్ అయితే ఉండదని రమేష్ వర్మ చెప్పుకొచ్చారు. తనకు ప్రేమ కథలను తెరకెక్కించడం ఇష్టమని అయితే కమర్షియల్ సినిమాలకే ఎక్కువగా దర్శకత్వం వహిస్తున్నానని ఆయన అన్నారు. ఖిలాడీ సినిమాతో రమేష్ వర్మ సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఖిలాడీ సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త కలెక్షన్ల రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చెప్పవచ్చు.