NTR30: తారక్30 మూవీ విషయంలో అలా జరుగుతోందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా మేకర్స్ ప్రస్తుతం లొకేషన్స్ ను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను గోవాలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. టెంపర్ సినిమాలోని మేజర్ సీన్లను గోవాలో షూట్ చేయడం జరిగింది.

ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ ఈ సినిమాను 2023 దసరాకు రిలీజయ్యేలా ప్లాన్ చేయాలని సూచనలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్ ఈ సినిమా కోసం ఎనిమిది నెలల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్ సాధించడం కొరటాల శివకు కీలకం కాగా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివ తారక్ సినిమా పూర్తయ్యే వరకు మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.  కొరటాల శివ ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనుండగా

తారక్ మాత్రం 70 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. కెరీర్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తారక్ నిర్ణయాలు తీసుకుంటుండగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయనే సంగతి తెలిసిందే.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus