Nuvvu Naku Nachav: నువ్వు నాకు నచ్చావ్ మూవీకి అలాంటి టాక్ వచ్చిందా?

కొన్ని సినిమాలను బుల్లితెరపై, యూట్యూబ్ లో ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలను మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తుంది. అలాంటి సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి. వెంకటేష్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటి కాగా ఈ సినిమాను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే. వెంకటేష్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ ను సైతం ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వే కావాలి సినిమా ఘన విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు.

నువ్వు నాకు నచ్చావ్ కథ అమితంగా నచ్చడంతో ఆలోచించకుండానే ఈ సినిమా స్క్రిప్ట్ ను వెంకటేష్ ఓకే చేశారు. త్రివిక్రమ్ మొదట అనుకున్న కథ ప్రకారం నువ్వు నాకు నచ్చావ్ మూవీలో బ్రహ్మానందం సీన్లు కానీ ఔట్ డోర్ సీన్లు కానీ లేవు. అయితే సురేష్ బాబు, ఇతరుల సూచనల మేరకు కథలో ఈ సన్నివేశాలు యాడ్ అయ్యాయి.ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేయాలని భావించినా ఆ సమయంలో ప్రకాష్ రాజ్ పై బ్యాన్ అమలవుతోంది.

ఈ పాత్రకు నాజర్, రఘువరన్ పేర్లను పరిశీలించినా ప్రకాష్ రాజ్ తప్ప ఆ పాత్రకు ఎవరూ న్యాయం చేయలేరని దర్శకనిర్మాతలు భావించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యాన్ తొలగించిన తర్వాత ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటించారు. దాదాపుగా 190 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు టాక్ ఆశాజనకంగా లేకపోవడంతో పాటు సినిమా మూడు వారాలు ఆడటం కూడా కష్టమేనని కామెంట్లు వచ్చాయి.

రెండో వారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus