ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి సినిమా ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే. మరీ కొత్త కథ కాకపోయినా మంచి సందేశం ఉండటంతో పాటు కొరటాల శివ ప్రభాస్ ను స్టైలిష్ గా చూపించడం ఈ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించింది. అయితే మిర్చి సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.
యూవీ క్రియేషన్స్ సక్సెస్ వెనుక ఈ సినిమా పాత్ర ఎంతో ఉంది. అయితే అప్పులు తీర్చడానికే మిర్చి సినిమాలో నటించానంటూ ప్రభాస్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళితో పని చేయడం గురించి ప్రభాస్ మాట్లాడుతూ ఛత్రపతి షూటింగ్ సమయంలోనే జక్కన్న గొప్ప డైరెక్టర్ అవుతారని అనిపించిందని చెప్పుకొచ్చారు. బాహుబలి మూవీ ప్లానింగ్ సమయంలోనే తాను రెబల్ మూవీలో నటించానని ప్రభాస్ పేర్కొన్నారు.
మిర్చి సినిమాలో నటించే ఛాన్స్ రాగా కొంచెం అప్పుల్లో ఉన్నానని ఈ సినిమాలో నటించి ఆ అప్పులను తీర్చుకుంటానని చెప్పానని రమ గారు ఆ సమయంలో మిర్చి సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపారని ప్రభాస్ చెప్పుకొచ్చారు. సొంత బ్యానర్ ఒకటి ఉంటే బాగుంటుందని భావించి యూవీ క్రియేషన్స్ ను మొదలుపెట్టామని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ అప్పులు చేయడానికి కారణమేంటనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. ప్రభాస్ అప్పులు చేశాడంటే నమ్మలేకపోతున్నామని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా చరిత్ర సృష్టించే హిట్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.