Star Heroes: ఆ హీరోలు మరి ఇంత వెనుకబడి ఉన్నారా..?

Ad not loaded.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సాధారణంగా అన్ని విషయాలకు సంబంధించి కచ్చితంగా శిక్షణ తీసుకుని ఉంటారు. సినిమాలో ఎప్పుడు ఏ సన్నివేశంలో నటించాల్సి వస్తుందో చెప్పలేం కాబట్టి డ్రైవింగ్ కచ్చితంగా నేర్చుకుంటారు. చిన్నచిన్న సన్నివేశాల్లో డూప్ లు నటించడం హీరోలకు కూడా అస్సలు నచ్చదనే సంగతి తెలిసిందే.ఒకవేళ ఆయా సన్నివేశాల్లో డూప్ లు నటించినా ప్రేక్షకులు గుర్తు పడితే హీరోల పరువు పోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరో రానాకు మాత్రం బైక్ డ్రైవింగ్ అస్సలు రాదట.

జూన్ 2వ తేదీన పరేషాన్ మూవీని విడుదల చేస్తున్న రానా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఒక సందర్భంలో రానా మాట్లాడుతూ తనకు బైక్ డ్రైవింగ్ రాదని అన్నారు. బైక్ నడిపే వాళ్లకు తాను పెద్ద అభిమానినని అయితే తాను మాత్రం బైక్ నడపనని ఆయన చెప్పుకొచ్చారు. రానా బైక్ నడపడం రాదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే రానానే స్వయంగా చెప్పడంతో ఆయన చెప్పిన విషయాలను నమ్మాల్సి వస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బైక్ నడపడం రాకపోవడంలో విచిత్రం.  (Heroes) మరో హీరో అయితే ఏకంగా తనకు ఫోన్ పే ఉపయోగించడం రాదని చెబుతున్నారు. న్యాచురల్ స్టార్ నాని ఒక సందర్భంలో తనకు ఫోన్ పేఎలా వాడాలో తెలియదని కామెంట్లు చేశారు.కమెడియన్ బ్రహ్మనందం కూడా తనకు బైక్ నడపడం రాదని గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. కిక్ సినిమాలో బ్రహ్మానందం బైక్ నడిపిన సన్నివేశాలను ఎంతో కష్టపడి షూట్ చేశారని సమాచారం అందుతోంది. రానా, నాని ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.రానా, నాని కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus