Suriya, Jyothika Daughter: సూర్య కూతురి టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సూర్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య ప్రస్తుతం కంగువా సినిమాలో నటిస్తుండగా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. సూర్య రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్య, జ్యోతిక కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అయితే సూర్య, జ్యోతికల కూతురు దియా గతంలో మంచి మార్కులు సాధించడం ద్వారా పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు.

అయితే చదువులో ముందువరసలో ఉండే దియా స్పోర్ట్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. జ్యోతిక తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో “కెప్టెన్ దియా, దేవ్ మేము గర్వపడుతున్నాం” అంటూ రాసుకొచ్చారు. సూర్య కూతురు దియా ప్రస్తుతం అసెండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నారు. జ్యోతిక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ముంబైలో ఉన్న జ్యోతిక రెండు హిందీ సినిమాలలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే జ్యోతిక బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ కావడం ఖాయమని చెప్పవచ్చు.

సూర్య, జ్యోతికల పిల్లలు కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిల్లలను చదువుతో పాటు ఆటల్లో సూర్య, జ్యోతిక ప్రోత్సహిస్తున్నారు. సూర్య, జ్యోతిక విడాకులు తీసుకుంటున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలు వైరల్ కాగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. సూర్య కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సూర్య, జ్యోతికలను (Suriya, Jyothika) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సూర్య టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య సినిమాల కోసం తన లుక్స్ ను మార్చుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus