Vijay, Balayya: ఆ ఏరియాలో బాలయ్య మూవీకి అన్యాయం జరుగుతోందా?

  • November 15, 2022 / 06:01 AM IST

2023 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా మూడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా ఈ సినిమాలకు థియేటర్లను కేటాయించే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగులో విజయ్ కు క్రేజ్ లేకపోయినా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడంతో ఆయన సొంత థియేటర్లలో వారసుడు సినిమానే ప్రదర్శితం కానుంది. ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తి కావడంతో ఇతర నిర్మాతలు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నా అందుకు భిన్నంగా జరుగుతోంది. వైజాగ్ ఏరియాలో ప్రైమ్ థియేటర్లను వారసుడు సినిమాకే కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైజాగ్ లో విజయ్ సినిమాకు 6 థియేటర్లు దక్కితే వీరసింహారెడ్డి సినిమాకు కేవలం 3 థియేటర్లు దక్కాయని సమాచారం అందుతోంది. వైజాగ్ లో బాలయ్య సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. సినిమా రంగ పెద్దలు తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. థియేటర్ల సమస్య వల్ల ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా మాత్రం భారీగా నష్టపోనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పెద్ద సినిమాలు సోలోగా థియేటర్లలో విడుదలవుతున్నా నెగిటివ్ టాక్ వస్తే ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదు. ఈ ఏడాది దసరాకు విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. థియేటర్ల సమస్య వల్లే పలు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. రాబోయే రోజుల్లో సంక్రాంతి, దసరా పండుగలకు రెండు కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేయకుండా నిబంధనలను అమలులోకి తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తన సినిమాకు థియేటర్ల సమస్య రాకుండా బాలయ్య అడుగులు వేయాల్సి ఉందని కొంతమంది సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయానికి థియేటర్ల సమస్య పరిష్కారం కావాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus