కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ కు తమిళనాడు రాష్ట్రంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ పెరుగుతుండగా విజయ్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే విజయ్ సీఎం కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఊహించని స్థాయిలో విజయ్ కు ఫ్యాన్ బేస్ ఉండగా అదే సమయంలో విజయ్ తెలివిగా అడుగులు వేస్తున్నారు.
గతంలో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం విజయ్ రాజకీయాల్లో కచ్చితంగా సంచలనాలు సృష్టించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రశంసించిన విజయ్ వాళ్లకు బహుమతులను అందజేయడంతో పాటు ఓటు విలువ గురించి అర్థమయ్యేలా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా అభిమానులతో సమావేశమైన విజయ్ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించి చర్చించడంతో పాటు రాజకీయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారని భోగట్టా. ప్రజలకు ఎదురవుతున్న సమస్యల గురించి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాల గురించి కూడా విజయ్ చర్చించినట్టు సమాచారం అందుతోంది. విజయ్ రాజకీయాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నారని భోగట్టా.ప్రస్తుతం విజయ్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో లియో సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా (Vijay) విజయ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో విజయ్ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ కు క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం విజయ్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.