చిరంజీవి ‘యముడికి మొగుడు’.. సినిమా గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు..!

కొణిదెల శివశంకర వరప్రసాద్.. ఈ పేరు వింటే ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ చిరంజీవి అంటే చాలు చిన్న పిల్లాడైనా గుర్తుపట్టేస్తాడు. తన కృషి, పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలారు చిరు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు దక్షిణాదిలో తిరుగులేని స్టార్ గా, అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, కేంద్ర మంత్రిగా, మానవతావాదిగా నిలిచారు మెగాస్టార్. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు . ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. వీటిలో ఒకటి ‘యముడికి మొగుడు’.

సాంఘిక చిత్రాలు చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న చిరంజీవి మైథలాజికల్ టచ్ వున్న సినిమా ఎందుకు చేయడం అనుకున్న వారికి మరో హిట్ కొట్టి నోళ్లు మూయించారు మెగాస్టార్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం 1988లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ యమునిగా నటించారు. చిరు మిత్రులైన నటులు జీవీ నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాను చూసిన చాలా మంది దీనిని ఎన్టీఆర్ ‘యమగోల’ను స్పూర్తిగా తీసుకుని చేశారని అనుకున్నారు.

కానీ ఈ చిత్రానికి హాలీవుడ్ లో వచ్చిన చిత్రమట. ఈ విషయాన్ని నటుడు నారాయణ రావు ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1978లో వచ్చిన ‘హెవెన్ కెన్ వెయిట్’ అనే సినిమాను వారెన్ బీట్టీ, బక్ హెన్రీ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. వారెన్ బీట్టీ హీరోగా నటించారు. దీనిని చూసిన తాను, సత్యానంద్ ‘యముడికి మొగుడు’ కథను రూపొందించినట్లు నారాయణ రావు తెలిపారు. అయితే యమలోకం అనే పాయింట్‌ను నాగబాబు సూచించారని ఆయన చెప్పారు.

అయితే ఈ తరహా కథలు రాయడంలో సిద్ధహస్తుడైన డీవీ నరసరాజు దగ్గరకు వెళ్లామని.. కానీ తాను ఇప్పటికే అలాంటి కథలు రాసి వుండటం చేత సబ్జెక్ట్ కు ఓకే చెప్పారని నారాయణ రావు అన్నారు. స్టోరీ డిస్కషన్ సమయంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారనే పెద్దలు చెప్పే మాటను సత్యానంద్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. దీంతో సత్యానంద్ నే స్క్రీన్ ప్లే రైటర్ గా తీసుకుని.. ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లామని నారాయణ రావు తెలిపారు. ఆ సినిమా ఆంధ్రదేశాన్ని ఊర్రుతలూగించడంతో పాటు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus