కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు మహేష్ బాబు తల్లి రియాక్షన్ ఏంటి?

  • November 18, 2022 / 11:41 AM IST

సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న మరణించిన సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలు కూడా నిన్న మహాప్రస్థానంలో ముగిసాయి. ఈ నేపథ్యంలో కృష్ణ గారి గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియని ఎన్నో విషయాలు, ఆయన సాధించిన ఘనతలు, సంచలనాలు వంటి వాటి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన పర్సనల్ లైఫ్ అందరికీ తెరిచిన పుస్తకమే అయినప్పటికీ అందులో మిస్ అయిన పేజీలు కొన్ని ఉన్నాయి.

వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణ- విజయ నిర్మల పెళ్లి గురించి. కృష్ణ గారు తన మొదటి భార్య ఇందిరా గారు ఉండగానే.. విజయ నిర్మల గారిని రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? వీళ్ళు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ గారి కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు వంటి విషయాల పై తాజాగా కృష్ణ గారి తమ్ముళ్లలో ఒకరైన ఆది శేషగిరిరావు స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

” అన్నయ్య విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకోవడం అనేది ఆయన పర్సనల్ విషయంగా నేను భావించాను. ఆ టైంలో వదిన గారు కంగారు పడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మా అమ్మ నాగ రత్నమ్మ గారు కృష్ణ గారి పై సీరియస్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా అర్థం చేసుకున్నారు. విజయ నిర్మల గారు మా బ్యానర్లో సినిమాలు డైరెక్ట్ చేయలేదు.కానీ ఆమె కూడా మంచి మనిషి” అంటూ ఆది శేషగిరిరావు గారు చెప్పుకొచ్చారు.

‘సాక్షి’ సినిమా టైంలో ప్రేమలో విజయ నిర్మల గారితో ప్రేమలో పడ్డ కృష్ణ గారు.. తిరుపతి ఆమెను ప్రైవేట్ గా పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే విజయ నిర్మల గారికి పెళ్లవ్వడం.. నరేష్ కు జన్మనివ్వడం జరిగింది. అయితే కృష్ణ- విజయ నిర్మల కి ఎటువంటి సంతానం లేదు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus