Salaar: ఆ సినిమాల కంటే సలార్ టీఆర్పీ తగ్గడానికి కారణాలివేనా?

  • May 3, 2024 / 08:41 PM IST

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబోలో తెరకెక్కిన సలార్ (Salaar)మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. క్రిస్మస్ పండుగ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ ను షేక్ చేసిన సలార్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి అక్కడ కూడా సంచలనాలు సృష్టించింది. థియేటర్లలో, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా బుల్లితెరపై కూడా హిట్ అవుతుందని అభిమానులు భావించారు.

అయితే కొన్నిరోజుల క్రితం బుల్లితెరపై ప్రసారమైన ఈ సినిమా కేవలం 6.5 రేటింగ్ తో రేటింగ్ పరంగా తీవ్రస్థాయిలో ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేయగా ఇతర సినీ అభిమానులు సైతం ఈ రేటింగ్ చూసి షాక్ అవుతున్నారు. స్కంద (Skanda) , గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాల రేటింగ్ కంటే సలార్ కు రేటింగ్ తక్కువగా వచ్చిందని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సలార్ రేటింగ్ తగ్గడానికి ఇతర కారణాలు సైతం ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

సలార్ ను చూడాలని భావించిన ప్రేక్షకులు థియేటర్లు, ఓటీటీలలో చూసేశారని సలార్ రిలీజైన మూడు నెలల తర్వాత బుల్లితెరపై ప్రసారం కావడంతో మరీ భారీగా రేటింగ్ రాలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ కు ఈ రేటింగ్ తక్కువైనా భవిష్యత్తులో ప్రసారమైన సమయంలో ఈ సినిమాకు మెరుగైన రేటింగ్ వస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఐపీఎల్ ప్రభావం సలార్ రేటింగ్ పై పడిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ ఫ్యాన్ బేస్ సపరేట్ అని కొన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తిస్థాయిలో కనెక్ట్ కావని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి (Baahubali: The Beginning) , బాహుబలి2 (Baahubali 2: The Conclusion), ఆదిపురుష్ (Adipurush) సైతం బుల్లితెరపై మంచి రేటింగ్ అందుకున్నాయని ప్రభాస్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా మరో 55 రోజుల్లో కల్కి మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus