Sarath Babu: శరత్ బాబు డైరీలో ఉన్న ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శరత్ బాబు కొన్నిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో మృతి చెందడం ఫ్యాన్స్ ను బాధ పెట్టిన సంగతి తెలిసిందే. నటుడిగా శరత్ బాబు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. శరత్ బాబు ఆస్తులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సమస్యలను మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. అయితే శరత్ బాబుకు డైరీ రాసే అలవాటు ఉందని సమాచారం.

ఆయన డైరీలో పేర్కొన్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన డైరీలో శరత్ బాబు సినిమాలలో నటించే సమయంలో ఎదురైన ఇబ్బందుల గురించి, తన ఫ్యామిలీ గురించి, ఇతర విషయాల గురించి రాశారని సమాచారం. హార్స్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకోవాలని భావించిన శరత్ బాబు అక్కడ స్థలం తీసుకుని ఇంటి పనులు కూడా మొదలుపెట్టారని బోగట్టా. ఆ ఇంటి పనులు పూర్తి కాకముందే శరత్ బాబు మృతి చెందారు.

శరత్ బాబు డైరీలో పొందుపరిచిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శరత్ బాబు ఆస్తులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆయన సోదరుడు ఆస్తులకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు. శరత్ బాబుకు ఎనిమిది మంది అన్నాదమ్ములు ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.శరత్ బాబు తన చెల్లెళ్ల పెళ్లిళ్లతో పాటు వాళ్ల సోదరుల పెళ్లిళ్లు సైతం చేశారని సమాచారం.

శరత్ బాబు (Sarath Babu) వీలునామాలో అక్కాచెలెళ్లు, అన్నాదమ్ముళ్లకు సమానంగా పంపకాలు జరిగేలా చేసినట్టు బోగట్టా. శరత్ బాబు దశదినకర్మ తర్వాత తర్వాత ఆస్తులకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. శరత్ బాబు తన జీవితకాలంలో వివాదాలకు దూరంగా ఉన్నారు. త్వరలో శరత్ బాబు వీలునామాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus