Nagarjuna: ‘ఘోస్ట్’ సినిమా కోసం ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు..!

గతేడాడి నాగార్జున హీరోగా నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ రిలీజ్ అయ్యింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఆ మూవీ కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయింది. అయితే ఓటిటిలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాలో నాగార్జున చాల రిస్కీ షాట్స్ లో పాల్గొన్నారు. 60ఏళ్ళకి పైగా వయసు కలిగిన వ్యక్తి ఆ రేంజ్ రిస్కీ షాట్స్ లో నటించడం అంటే మాములు విషయం కాదు.ఆ చిత్రంలో నాగార్జున నటనకి ప్రశంసలు దక్కాయి.

అయితే ఇప్పుడు ఆయన అంతకు మించిన రిస్కీ ప్రాజెక్టులో నటిస్తున్నట్టు స్పష్టమవుతుంది.’గరుడ వేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తార్.. నాగార్జున తో వైల్డ్ డాగ్ అనే మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్లో ఉంటాయట. ప్రస్తుతం ఘోస్ట్ షూటింగ్ తమిళనాడులోని కూనూర్‌లో జరుగుతుంది.అక్కడ ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో భాగంగా.. అక్కడ ఓ రిస్కీ షాట్ ను కూడా చిత్రీకరించారు. అదేంటంటే..యాక్షన్ సన్నివేశంలో భాగంగా ఓ కారుని 150 ఎత్తు గాల్లోకి లేపి తోటలో పడేశారట. ఇది నిజమైన ప్రమాదమే అనుకొని అక్కడి స్థానికులు పరుగులు తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.అంతేకాకుండా పోలీసులకు సమాచారం కూడా చేరవేశారు. పోలీసులు ఈ విషయమై ఎంక్వైరీ చేసి అది షూటింగ్లో భాగమే అని తెలుసుకుని వారికి వివరించారట.

దాంతో అక్కడి స్థానికులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus