డీజే రిలీజ్ విషయంలో సంచలన నిర్ణయం
- April 11, 2017 / 11:54 AM ISTByFilmy Focus
సరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన డీజే టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్నిమే 19 న రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు మొదట్లో అనుకున్నారు. కానీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. కారణం బాహుబలి కంక్లూజన్ అని కొంతమంది చెబుతున్నారు. ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎఫెక్ట్ కనీసం నెల రోజుల పాటు ఉంటుందని, అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారని వివరించారు. అసలు విషయం అది కాదంట.
అల్లు అర్జున్ కి ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడిందని, దీంతో షెడ్యూల్ ల్లో మార్పులు జరిగాయని సమాచారం. స్టైలిష్ స్టార్ పూర్తిగా కోలుకొని షూటింగ్ లో పాల్గొనాలంటే మరికొన్ని రోజులు అవుతుందని అందుకే మూవీ రిలీజ్ ని రెండు నెలలపాటు వాయిదా వేసినట్లు టాక్. గత వేసవి(ఏప్రిల్ 22 )లో సరైనోడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే తరహాలో ఈ ఏడాది వేసవిలో బన్నీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఆశించిన అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ వార్తే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















