Uday Kiran: కలలో జరిగినట్టే ఉదయ్ కిరణ్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారా?

  • August 8, 2023 / 07:08 PM IST

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు ఉదయ్ కిరణ్. హీరోగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు అనంతరం అవకాశాలు వచ్చాయి ఇలా ఉదయ్ కిరణ్ నటించిన వరుస మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ కావడంతో ఇండస్ట్రీ చూపు మొత్తం ఉదయ్ కిరణ్ వైపు పడింది.దీంతో ఎంతో మంది దర్శకనిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి తమ సినిమాలలో నటించాలని కోరారు.

ఈ విధంగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఉదయ్ కిరణ్ ను మెగా ఇంటికి అల్లుడు చేసుకోవాలని చిరంజీవి ఆరాటపడ్డారు. దీంతో తన పెద్ద కుమార్తె సుస్మితను ఇచ్చి తనకు ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. అయితే కొన్ని కారణాలవల్ల వీరి వివాహం ఆగిపోయింది. ఇలా నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పటికీ ఉదయ్ కిరణ్ పలు సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్నారు.

అనంతరం ఈయన నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం,సినిమా అవకాశాలు రాకపోవడం జరిగింది. ఇక ఈయన 2012వ సంవత్సరంలో విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇలా 2012వ సంవత్సరంలో వివాహం చేసుకున్నటువంటి ఉదయ్ కిరణ్ 2014వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు.. అయితే ఈయన మరణానికి కారణం ఆర్థిక సమస్యలేనని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ మరణానికి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది.

ఉదయ్ కిరణ్ (Uday Kiran) చనిపోవడానికి వారం రోజులు ముందు ఆయనకు ఒక భయంకరమైన కల వచ్చిందట ఇంట్లో తన భార్య లేని సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కల వచ్చిందట.ఈ కల గురించి తన భార్యకు చెప్పగా ఆమె మీరు డిప్రెషన్ లో ఉండి ఏవేవో ఆలోచిస్తున్నారు ముందు ఈ ఆలోచనలన్నింటిని మీ మైండ్ నుంచి తొలగించి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని చెప్పారట.కానీ ఈ కల వచ్చినా వారం రోజులకే ఉదయ్ కిరణ్ అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటూ ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus