మొన్న రణ్వీర్, నిన్న విష్ణు విశాల్, ఇప్పుడు ఇంకో హీరో..!

‘లైగర్’ సినిమా కోసం విజయ్ దేవరకొండ నగ్నంగా ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తే పెద్ద ఎత్తున రచ్చ చేశారు.ఇప్పుడు ఏకంగా కొంతమంది హీరోలు నగ్నంగా ఫోటో షూట్ లో పాల్గొని వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మామూలుగా హీరోయిన్లు ఇలాంటి ఫోటో షూట్స్ లో పాల్గొంటే అవి హాట్ టాపిక్ అవుతాయి. కానీ ఇప్పుడు హీరోలు చేస్తుంటే సెన్సేషన్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ ముందుగా నగ్నంగా పాల్గొన్న ఫోటో షూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొటోలు దిగి దేశమంతా హాట్ టాపిక్ అయ్యాడు రణవీర్. ఈ ట్రెండ్ ను తమిళ హీరో విష్ణు విశాల్ కూడా కొనసాగించాడు. ఇతనైతే తన భార్య జ్వాలా గుత్తా తో ఈ ఫోటో షూట్ చేయించుకున్నాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం వాటిని జ్వాలా రీట్వీట్ చేయడం గమనార్హం. తాజాగా ఈ ట్రెండ్ ను టాలీవుడ్ హీరో, నటుడు, హోస్ట్ అయిన నందు కూడా ఫాలో అవ్వడం షాక్ ఇచ్చే అంశం.

ఇతనైతే తన భార్య మరియు ప్రముఖ సింగర్, బిగ్ బాస్ ఆర్టిస్ట్ అయిన గీత మాధురితో ఈ ఫోటోలను షేర్ చేయించాడు. ఆమె ఈ ఫోటోలను షేర్ చేసి ఫోటోగ్రాఫర్ల పేర్లు కూడా మెన్షన్ చేయడం గమనార్హం. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అయితే ‘ఇదేం దిక్కుమాలిన ట్రెండ్ రా బాబు’ అంటూ తల కొట్టుకుంటున్న ఇమోజీలు పెడుతున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఓపిక ఉంటే మీరు కూడా ఓ లుక్కేయండి :

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus