Samantha, Jr NTR: సమంతకు విచిత్రమైన సమస్య.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే రెండు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో కూడా సమంతకు ఛాన్స్ దక్కిందని సమాచారం అందుతోంది. సమంతకు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉండటంతో కొరటాల శివ సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

విడాకుల తర్వాత సమంతకు ఆఫర్లు బాగానే వస్తున్నా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. అయితే ఇలాంటి సమయంలో సమంతకు తారక్ కు జోడీగా నటించే అవకాశం దక్కింది. అయితే తారక్ సినిమా కోసం డేట్లు కేటాయించాల్సిన సమయంలోనే ఆమె డేట్లు వేరే ప్రాజెక్ట్ లకు ఫిక్స్ అయ్యాయి. తారక్ సినిమాను వదులుకోవడం సమంతకు అస్సలు ఇష్టం లేదని సమాచారం అందుతోంది. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ కు,

ఒక హిందీ సినిమాకు, విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఖుషి సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లు కావడంతో ఈ ప్రాజెక్ట్ లకు నో చెప్పడం సమంతకు సులువు కాదు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా తారక్ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సమంత అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. హీరోయిన్ ఫైనల్ కాకపోవడం కూడా ఈ సినిమా ఆలస్యానికి ఒక కారణమని చెప్పవచ్చు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. తారక్ కొరటాల శివ కాంబో మూవీ విడుదలైన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus