NTR: ఆ వ్యక్తికి ఇష్టం లేకపోవడం వల్లే తారక్, కళ్యాణ్ రామ్ అక్కడికి వెళ్లలేదా?

  • May 24, 2023 / 08:45 PM IST

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్, కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడంపై కొంతమంది కావాలని విమర్శలు చేస్తున్నారు. మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయినా తారక్ హాజరు కావాలని భావించే ఉంటే ఈ ఈవెంట్ కు వచ్చి ఉండేవారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తారక్, కళ్యాణ్ రామ్ ఈ ఈవెంట్ కు హాజరు కాకపోవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఈ ఈవెంట్ కు సంబంధించి ఆహ్వానం అందినా నందమూరి కుటుంబానికి సంబంధించిన కీలక వ్యక్తికి తారక్, కళ్యాణ్ రామ్ ఈ ఈవెంట్ కు రావడం ఇష్టం లేదు.

ఈ సమాచారం తన దృష్టికి రావడంతో వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని భావించి (NTR) తారక్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తారక్ ఏ తప్పు చేయకపోయినా కొంతమంది ఆయనను వేలెత్తి చూపిస్తున్నారు. తారక్ ను విమర్శించే వాళ్లు ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా గమనిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. రాజకీయాలకు సంబంధించి ఎన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా తారక్ నోరు మెదపడం లేదు.

అనవసర విషయాలలో, వివాదాలలో జోక్యం చేసుకుని విమర్శల పాలు కావడం తారక్ కు అస్సలు ఇష్టం లేదు. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి తారక్ ఇతరుల మంచి కోసం ఆలోచిస్తున్నా ఆయనకు చెడు జరుగుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ అయిన సింహాద్రి రీ రిలీజ్ కు సంబంధించి సోషల్ మీడియాలో అనవసర చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమా అసలు కలెక్షన్లను తక్కువగా చూపించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనపై వస్తున్న విమర్శలకు ఏదో ఒకరోజు తారక్ గట్టిగా సమాధానం చెబుతారని ఆరోజు కోసం మరి కొంతకాలం వేచి చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus