Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి.. షాకింగ్ రెమ్యునరేషన్

నవీన్ పొలిశెట్టి చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ హీరోలలో ఒకరు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో పవర్ఫుల్ అరంగేట్రం చేసిన ఈ నటుడు గత ఏడాది విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమాతో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత దర్శకుడు అనుదీప్ కెవి సీక్వెల్‌ను కూడా ప్రకటించాడు. కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇటీవల, అనుష్క శెట్టితో నవీన్ సినిమా హోల్డ్‌లో ఉందని వార్తలు వచ్చాయి. క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వచ్చింది.

కానీ అలాంటి రూమర్స్ కు యూవీ క్రియేషన్స్ చెక్ పెట్టేసింది. ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అలాగే త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ – నగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల అఫీషియల్ గా మరో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. రాబోయే సినిమాల కోసం నవీన్ పొలిశెట్టి 5 నుంచి 6 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకోనున్నట్లు టాక్ వస్తోంది.

నటుడు తన మూడవ సినిమా నుంచే ఇంత భారీ పారితోషికం అందుకోవడంతో విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా జాతిరత్నాలు సినిమాతో నవీన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలను అందించింది. 30కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో నిర్మాతలు అతని డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా నవీన్ ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఈ లెక్కన చూస్తే నవీన్ మరో బాక్సాఫీస్ హిట్ అందుకుంటే మాత్రం అతని రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీడియం రేంజ్ లో ఉన్న హీరోలకంటే కూడా ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంది. మరి నవీన్ పొలిశెట్టి రానున్న సినిమాలతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus