సూపర్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ మెదడుకి పదును పెట్టే సుకుమార్.. ఈసారి పాతికేళ్ల కథని తీసుకొని మెస్మరైజ్ చేసారు. అతని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం సంచలన విజయం సాధించింది. ఇందులో రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, అనసూయ, ఆది.. తదితరులు అద్భుతంగా నటించి వందరోజులకి పరుగులు పెట్టించారు. ఈ వేడుకను అత్యంత వైభంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ మహేష్ బాబు కోసం ఓ కథ చేస్తున్నారని, ఈసారి అతనికి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితో స్క్ర్పిట్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా తెలిసింది. ఎందుకంటే అతని చూపు బాలీవుడ్ వైపు పడినట్లు సమాచారం. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ అందుకున్నారు.
క్రిష్ కూడా మణికర్ణిక అనే భారీ ప్రాజక్ట్ చేస్తున్నారు. సో తెలుగు డైరక్టర్స్ తో అక్కడివారు నటించడానికి ఆసక్తికనబరుస్తున్నారు. పైగా రంగస్థలంతో సుకుమార్ అక్కడి హీరోలని, నిర్మాతలను ఆకర్షించినట్లు టాక్. అందుకే వారికోసం సుకుమార్ కథ రెడీ చేయడం, వినిపించడం, ఒకే చెప్పడం… జరిగిపోయాయంట. అక్టోబర్, బద్లాపూర్ అనే చిత్రాలతో ఆకట్టుకున్న యువ హీరో వరుణ్ ధావన్ సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. జీ ప్రొడక్షన్స్ వాళ్లు ఈ సినిమాని నిర్మించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటించనున్నారు. ఈ సినిమా హిట్ అయితే సుకుమార్ ని బాలీవుడ్ నిర్మాతలు వదలరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.