‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘కుబేర’ (Kubera) అనే సినిమా చేశాడు. తమిళ స్టార్ ధనుష్ (Dhanush) ఇందులో హీరో. రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. అన్నిటికంటే మించి అక్కినేని నాగార్జున (Nagarjuna) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ‘లవ్ స్టోరీ’ నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ‘కుబేర’ టీజర్ ఇదివరకే రిలీజ్ అయ్యింది. దానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ధనుష్ లుక్స్..
అలాగే దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తిని రేకెత్తించాయి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఫార్మేట్లో ఈ గ్లింప్స్ లేదు. అతను పంధా మార్చుకుని చేసినట్లు అనిపించింది. మరో 2,3 రోజుల్లో ట్రైలర్ ను కూడా లంచ్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘కుబేర’ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోయిందట. అయితే రషెస్ చూసుకున్న తర్వాత టీం కొంత టెన్షన్ ఫీల్ అయినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే ఈ సినిమా రన్ టైం 2 గంటల 50 నిమిషాలు వచ్చిందట.థియేటర్ యాడ్స్ వంటి వాటితో కలుపుకుంటే 3 గంటలు దాటుతుంది. ఇంత రన్ టైం అంటే ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు. సినిమా బాగుంది అంటే దానిని కూడా లెక్కచేయరు. కానీ సినిమా రిలీజ్ అయ్యే వరకు అయితే.. టీంని ఇది టెన్షన్ పెట్టే అంశమే అని చెప్పాలి. ఇక ‘కుబేర’ చిత్రం జూన్ 20న రిలీజ్ కానుంది.