Allu Arjun: మెగా సామ్ కాంబోలో సినిమా వస్తే హిట్టేనా?

స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా కోసం బన్నీ, రష్మిక ఫ్యాన్స్ తో పాటు పాటు సమంత ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం తర్వాత తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు మెగా హీరోల సినిమాల్లో సమంత నటిస్తే హిట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో బన్నీ, సమంత హీరోహీరోయిన్లుగా సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. బన్నీ సామ్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో సామ్ హీరోయిన్ కాగా ఈ సినిమా సక్సెస్ సాధించింది. చరణ్, సామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సెంటిమెంట్ వల్ల అల్లు అర్జున్ హీరోగా సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న పుష్ప మూవీ కూడా హిట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నాలుగు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. సుకుమార్ ఊరమాస్ కథాంశంతో తెరకెక్కించిన పుష్ప బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 141 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తం అమ్ముడయ్యాయని సమాచారం. వచ్చే ఏడాది పుష్ప పార్ట్2 రిలీజ్ కానుంది. ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులు షాకయ్యే విధంగా ఉండనుందని సమాచారం. బన్నీ కష్టానికి తగ్గ ఫలితం పుష్పతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus