Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ మూవీ ముహూర్తం వాయిదాకు రీజన్ ఇదే!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీన ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయినా ఊహించని విధంగా ఈ సినిమా ముహూర్తం పోస్ట్ పోన్ అయింది. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. అయితే ముహూర్తం పోస్ట్ పోన్ కావడానికి అలియా భట్ కారణమని సమాచారం.

Click Here To Watch

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ముహూర్తం రోజున హాజరు కాలేనని మేకర్స్ కు ముందుగానే సమాచారం ఇచ్చారు. అయితే అలియా భట్ కూడా చివరి నిమిషంలో తాను హాజరు కాలేనని మేకర్స్ కు సమాచారం ఇవ్వడంతో ముహూర్తం పోస్ట్ పోన్ అయింది. హీరో హీరోయిన్ ఇద్దరూ హాజరు కాకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం కరెక్ట్ కాదని మేకర్స్ భావించినట్టు బోగట్టా. త్వరలో ఈ సినిమా లాంఛ్ కార్యక్రమం జరగనుంది.

ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుండగా 2023 సంవత్సరం సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుందని బోగట్టా. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గతంలోనే తారక్ సినిమాకు పని చేసే ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల అనిరుధ్ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ అలియా భట్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కొత్త తరహా కథాంశంతో రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. సినిమాసినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్రేజ్ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తో వచ్చే క్రేజ్ ను బట్టి తారక్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోనున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus